వాంఖెడేలో సంజు విధ్వంసం.. శశి థరూర్ కవితాత్మక ప్రశంసలు!
- ముంబైపై 54 బంతుల్లో 101 పరుగులు చేసిన సంజు శాంసన్
- అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శతకం అని థరూర్ ప్రశంస
- సునాయాసంగా సాధించాడని కితాబు
ఐపీఎల్ లో నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ముంబై వాంఖెడే మైదానం ఆతిథ్యమిచ్చిన ఈ మ్యాచ్ లో సీఎస్కే ఆటగాడు సంజు శాంసన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడాడు. కేవలం 54 బంతుల్లో 101 పరుగులు చేసి ముంబై బౌలర్లను చిత్తు చేశాడు. మ్యాచ్ లో సంజూ చూపిన ప్రతిభపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఎక్స్ వేదికగా కవితా రూపంలో ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
"సంజులో ఏదో ఉంది,
గాలిలో ఒక సొగసు,
మణికట్టు కదలికతో, నిర్లక్ష్యపు చూపుతో.
టైమింగ్ సరిగ్గా కుదిరి బంతి వికెట్‌ను తాకినప్పుడు,
మనమందరం చేయాలని కోరుకునే పనులను అతను చేస్తాడు.
జైపూర్ మిరుమిట్లు గొలిపే వెలుగుల నుండి వాంఖేడే సూర్యుడి వరకు,
అతను ఒత్తిడిని పెంచి, ఆపై పరుగు లంకిస్తాడు.
అద్భుతమైన నైపుణ్యంతో చెక్కిన శతకం.
"చెపాక్" అయినా, "డర్బన్" అయినా, అతను ఆ నేలను తన ఆధీనంలోకి తీసుకుంటాడు.
బలవంతంగా బాదడం గానీ, కష్టపడటం గానీ లేదు,
కేవలం సునాయాసమైన గమనమే.
స్వచ్ఛమైన కాంతి రేఖలతో చిత్రించిన వంద పరుగులు.
ఆ మైలురాయిని చేరుకోవడానికి ఎంతకాలం వేచి ఉండాల్సి వచ్చినా,
సంజు సాధించే అద్భుతానికి సాటి మరొకటి లేదు" అంటూ కవితాత్మక శైలిలో ట్వీట్ చేశారు.